సోమవారం, 12 జనవరి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2017 (18:17 IST)

తేనెతో మొటిమలు, మచ్చలు దూరమవుతాయ్..

టీనేజీలో మొటిమలకు తేనె దివ్యౌధషంగా పనిచేస్తుంది. మొటిమలు, వాటి తాలూకు మచ్చలతో ఇబ్బందిపడే అమ్మాయిలు చెంచా తేనెలో రెండు చెంచాల నిమ్మరసం, కాస్త గులాబీనీరు కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేస్తే మం

టీనేజీలో మొటిమలకు తేనె దివ్యౌధషంగా పనిచేస్తుంది. మొటిమలు, వాటి తాలూకు మచ్చలతో ఇబ్బందిపడే అమ్మాయిలు చెంచా తేనెలో రెండు చెంచాల నిమ్మరసం, కాస్త గులాబీనీరు కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా రోజూ చేస్తుంటే మొటిమలు దూరమవుతాయి. అలాగే చర్మంపై ముడతలను తొలగించాలంటే.. పావుకప్పు తేనెలో గుడ్డులోని తెల్లసొన కలుపుకోవాలి. 
 
అందులో చెంచా నిమ్మరసం గిలకొట్టి ముఖంతో పాటు మెడకు, చేతులకు ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే ముడతల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. చర్మం నల్లగా మారిపోతే.. తేనెను ఉపయోగించాలి. ఉదయం పూట కాసిన్ని పచ్చిపాలలో చెంచా తేనె, రెండు చెంచాల సెనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకుని అరగంట తర్వాత చనీళ్లలో కడిగిస్తే.. ముఖం కాంతివంతంగా మారుతుంది.