బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 4 ఆగస్టు 2017 (19:57 IST)

చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలన్నారంటే... మంత్రి అచ్చెన్న ఆవేదన

అమరావతి : దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టాన్ని నమ్ముకొని నిరంతరం శ్రమిస్తూ కృషి, పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగారని, అటువంటి వ్యక్తిని కాల్చి చంపాలని సాక్షాత్తు ప్రతిపక్ష నేత జగన్మోహన రెడ్డి అనడం తమను ఆవేదనకు గిరిచేసి

అమరావతి : దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టాన్ని నమ్ముకొని నిరంతరం శ్రమిస్తూ కృషి, పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగారని, అటువంటి వ్యక్తిని కాల్చి చంపాలని సాక్షాత్తు ప్రతిపక్ష నేత జగన్మోహన రెడ్డి అనడం తమను ఆవేదనకు గిరిచేసిందని మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనందబాబు, శాసన మండలి సభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. 
 
సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం మధ్యాహ్నం వారు మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచంలోని ప్రముఖుల్లో ఒకరిగా ఎదిగిన మహావ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తూ ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి వ్యక్తిని, పెద్దరికానికి కూడా గౌరవం ఇవ్వకుండా నడిరోడ్డుపై కాల్చిచంపాలని అన్నారంటే, అతను ఎటువంటి వ్యక్తో నంద్యాల ప్రజలు ఆలోచించాలన్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న ప్రతిపక్షనేత రాజకీయ అవగాహన లేకుండా ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఈ విధమైన భాష మాట్లాడటం భావ్యంకాదన్నారు. రాజకీయాల్లో వ్యక్తులు చంద్రబాబులా రోల్ మోడల్‌గా ఉండాలన్నారు.
 
నంద్యాల ప్రశాంతమైన పట్టణమని, అక్కడి ప్రజలు ఉప ఎన్నికల్లో రాజకీయంగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడం కోసమే భూమా నాగిరెడ్డి తమ పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నంద్యాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. సమావేశంలో కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ (కాపు కార్పోరేషన్) చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కూడా పాల్గొన్నారు.