గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 మే 2017 (11:19 IST)

చిరంజీవి 'ఉయ్యాలవాడ' హీరోయిన్ ఎంపికపై ఊగిసలాట

మెగాస్టార్ చిరంజీవి 151 మూవీగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించనున్నారు. సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి మాటలు, కథ సిద్ధం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 151 మూవీగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించనున్నారు. సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్  ఈ చిత్రానికి మాటలు, కథ సిద్ధం చేస్తున్నారు. అయితే ఉయ్యాలవాడ జీవితానికి వీరపాండ్య కట్టబొమ్మన జీవితానికి చాలా పోలికలు వున్నాయట. దీంతో ఉయ్యాలవాడపై వీరపాండ్య వాసనలు రాకుండా పరుచూరి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారట.
 
ఇక ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయంలో కూడా ఊగిసలాటలో చిత్ర యూనిట్ వుంది. చిరంజీవితో ఐశ్వర్య రాయ్ పేరు దాదాపుగా ఖరారైనట్టు వార్తలు బయటకు పొక్కాయి. అయితే, డైరెక్టర్ సురేంద్ర రెడ్డి మాత్రం ఐశ్వర్య రాయ్.. విద్యాబాలన్ ఇద్దరితోనూ సమావేశమయ్యారట. ఈ ఇద్దరిలో ఎవర్ని ఫైనల్ చేయాలనే విషయంలో ఇంకా సురేంద్ర రెడ్డి క్లారిటీగా లేడనేది ఇన్ సైడ్ న్యూస్. 
 
కాగా, ఈ చిత్రాన్ని కూడా చిరంజీవి కుమారుడు, టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సొంతగా నిర్మించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌పై చిరంజీవి 150వ చిత్రాన్ని రాంచరణ్ నిర్మించి... టాలీవుడ్ రికార్డులు బద్ధలు కొట్టిన విషయం తెల్సిందే. ఇపుడు చిరంజీవి 151వ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు.