అక్కినేని అభిమానులను టెన్షన్ పెడుతున్న అల్లు అరవింద్..!
అక్కినేని అఖిల్ నటించిన మూడు చిత్రాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను.. నిరాశపరిచాయి. దీంతో అఖిల్ నాలుగవ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఎలాగైనా సరే.. సక్సెస్ సాధించాలని అఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. రవిరాజా పినిశెట్టి కుమారుడు, ఆది పినిశెట్టి సోదరుడు ప్రభాస్ పినిశెట్టి చెప్పిన కథను ఓకే చేసాడు.
ఈ కథతో అఖిల్ నాలుగవ సినిమా ఉంటుంది అనుకుంటే.. లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ చేసారు. ఎందుకంటే... ఈ సినిమా అఖిల్‌కి చాలా ఇంపార్టెంట్. అందుచేత నాగ చైతన్యకి బ్లాక్‌బస్టర్ 100% లవ్ చిత్రాన్ని అందించిన అల్లు అరవింద్ అనుబంధ సంస్థలో అఖిల్ నాలుగవ చిత్రం చేస్తున్నాడు. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడు. గోపీ సుందర్ సంగీతమందించనున్న ఈ చిత్రానికి సంబంధించి కథానాయిక ఎంపిక ఇంకా పూర్తవలేదు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాని ఎప్పుడో ప్రారంభించాలి కానీ... స్ర్కిప్ట్‌లో పూర్తిగా సంతృప్తి చెందకపోవడంతో ప్రారంభోత్సవం వాయిదా వేస్తూ వస్తున్నారు. మే 24న లాంఛనంగా ప్రారంభించనున్నారని వార్తలు వస్తున్నాయి కానీ... అఫిషియల్‌గా ప్రకటించలేదు. దీంతో అక్కినేని అభిమానులు ఇంకెప్పుడు సినిమాని స్టార్ట్ చేస్తారు అంటూ తెగ టెన్షన్ పడుతున్నారట. మరి... త్వరలోనే ఈ సినిమా ప్రారంభోత్సవంపై క్లారిటీ వస్తుందేమో..!