సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (19:52 IST)

లిప్ లాక్ గురించి ఆనంద్ దేవరకొండ.. పెదవులపై చక్కెర, నోటిలో బ్లేడ్?

Baby
Baby
యువ నటుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ సినిమా శుక్రవారం రిలీజైంది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ నిర్మించారు. 
 
ఇటీవల మేకర్స్ లీడ్ యాక్టర్స్ లిప్ లాక్ ఉన్న పోస్టర్‌ని రిలీజ్ చేసారు. ఈ లిప్ కిస్ సీన్‌పై ఇటీవల ఆనంద్ దేవరకొండ మీడియాతో ఓపెన్ అయ్యాడు. నటి పెదవులపై చక్కెర, నోటిలో బ్లేడ్ ఉంది. ఆ ముద్దు వెనుక ప్రేమ ఉందా? నొప్పి ఉంటుందా? ఆ కిస్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందనే కోణంలో పోస్టర్ డిజైన్ చేశామని, ఈ ప్రేమకథకు అలాంటి అర్థం ఉందని వెల్లడించారు. 
 
ప్రేమలో ఆనందం, బాధ రెండూ ఉంటాయి. మేకర్స్ ఆ ఎమోషన్స్ బాగా చూపించారు. ప్రేక్షకులు కూడా సినిమాకు కనెక్ట్ అవుతారు. అందరూ థియేటర్‌లో సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆనంద్ అన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ బేబీ సినిమాలో మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపారు.