1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Modified: గురువారం, 13 జులై 2023 (15:31 IST)

బేబీ కల్ట్ సినిమా- పెద్ద హిట్ కావాలి : అల్లు అరవింద్

allu aravind and baby team
allu aravind and baby team
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు అల్లు అరవింద్, డైరెక్టర్ మారుతి, బింబిసార దర్శకుడు వశిష్ట, రాహుల్ సంకృత్యాన్, బన్నీ వాసు, మెహర్ రమేష్, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సానా, కార్తీక్ వర్మ దండు, బలగం వేణు, వీఐ ఆనంద్, సంపూర్ణేశ్ బాబులు ముఖ్య అతిథులుగా వచ్చారు. అల్లు అరవింద్ బిగ్ టికెట్‌ను రిలీజ్ చేశారు.
 
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'కొంత కాలం క్రితం బేబీ రషెస్ చూశాను. ఇది కల్ట్ సినిమా. రాజేష్ ఆకారం చూస్తే కల్ట్ అనిపించదు. కానీ బుర్రంతా కల్ట్. ఆయన హార్ట్‌ను ఎంత మంది బ్రేక్ చేశారో తెలియడం లేదు. సాయి రాజేష్‌ ఓ మంచి ప్రేమికుడు. కాకినాడలో ఎక్కడో చిన్న మ్యూజిక్ ప్లే చేసుకునేవాడు.. గీతా ఆర్ట్స్‌లో పని చేయించుకోవాలనేలా చేశాడు. టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అని నిరూపించాడు. విజయ్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. వైష్ణవిది రియల్ ఎమోషన్. అలాంటి ఎమోషన్లు ఈ సినిమాలెన్నో ఉన్నాయి. ఆనంద్ గురించి విజయ్‌కి ఫోన్ చేశాను. రష్ చూశాను.. మీ తమ్ముడు ఏంటి చించేశాడు? అని అన్నాను. కొన్ని సీన్లలో ఆయన నటన చూస్తే మన కంట్లోంచి నీరు వస్తుంది. త్రీ రోజెస్ చూసినప్పుడే బాల్ రెడ్డి గురించి అడిగాను. బాల్ రెడ్డి మట్టిలో మాణిక్యం లాంటివాడు. చాక్లెట్ బాయ్ విరాజ్ అశ్విన్‌ కూడా అద్భుతంగా చేశాడు. ధీరజ్‌ త్వరగా పైకి వస్తాడు. బేబీ దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
 
సాయి రాజేష్ మాట్లాడుతూ, విజయ్ బుల్గానిన్ ఆరు పాటలు ఇచ్చాడు. ఇందులో ఆరు పాటల కోసం నేను రెండొందల పాటలు రిజెక్ట్ చేశాను. అవన్నీ కూడా ఎంతో గొప్పగా ఉంటాయి. ఈ మూడేళ్లు మేం ఇద్దరం ఎన్నో గంటలు కలిసి పని చేశాం. నెలన్నర నుంచి మా ఇద్దరికీ నిద్ర లేదు. ఆర్ఆర్ మీద పని చేస్తూనే ఉన్నాం. క్యూబ్‌లో నిన్న సినిమా చూశాం. గుండె బరువెక్కింది. బేబీలోని ఆత్మ విజయ్, బాల్ రెడ్డి వల్లే వచ్చింది. హృదయ కాలేయం సినిమాను చూసి మారుతి గారు బాగుందని అన్నారు. బడ్జెట్ ఎంత అని తెలుసుకుని.. నేను చూడని అమౌంట్ నాకు ఇచ్చారు. నా కొబ్బరిమట్ట కష్టాల్లో ఉంటే కాపాడారు. ఆయన సలహాలు తీసుకున్నాను. తప్పులు ఉంటే చెబుతుంటారు. రైటర్ రవి కూడా నా తప్పులు చెబుతుంటాడు. మారుతి, రవి వల్లే బేబీ ఇంత బాగా వచ్చింది. జూలై 14న సినిమా వస్తోంది. ఎంత నిడివి ఉన్నా కూడా మిమ్మల్ని పరిగెత్తిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు అని అన్నారు.
 
బన్నీ వాస్ మాట్లాడుతూ,  ఈ శుక్రవారం బేబీ టీం ఫేట్ మారుతుంది. విజయ్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆయన మరింత ఎత్తుకు ఎదుగుతాడు. రాజేష్ మంచి దర్శకుడు. మంచి సినిమాను తీశాడు. బడ్జెట్ పెరుగుతోందని అనిపించింది. కానీ ఆయన సినిమా తీయలేదు. ఓ జీవితాన్ని తీశాడు. ఎస్‌కేఎన్‌కు ఆల్ ది బెస్ట్' అని అన్నారు.
 
నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. 'నేను ఈ సినిమాను అల్లు అరవింద్ గారికి అంకితం చేస్తున్నాను. నేను చేసిన సినిమాల్లో జీఏ అని ఉంటుంది. కానీ సోలో నిర్మాతగా నన్ను నిరూపించుకోమని అల్లు అరవింద్ గారు అన్నారు. నా ఫ్రెండ్ మారుతికి ఓ మాటిచ్చాను. ఆయన డబ్బులు పోగొట్టుకోకూడదని అనుకున్నాను. టేబుల్ ప్రాఫిట్‌తో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఇదే నేను ఆయనకు ఇచ్చే గిఫ్ట్. ఆనంద్ దేవరకొండ అన్నట్టు నేను వాళ్ల ఫ్యామిలీకి లక్కీ కాదు.. నాకే వాళ్ల ఫ్యామిలీ లక్కీ అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ.. 'ఎక్కడో కాకినాడలో మ్యూజిక్ చేసుకునే నన్ను ఈ రోజు ఇలా అల్లు అరవింద్ గారి ముందు మాట్లాడేలా చేసిన సాయి రాజేష్ అన్నకి థాంక్స్. సాయి రాజేష్, విజయ్ బుల్గానిన్‌ను కలిపితేనే బేబీ సినిమా మ్యూజిక్ వచ్చింది. ఆనంద్, వైష్ణవి, విరాజ్‌ గార్ల నటనను చూసి నేను ఫ్యాన్ అయ్యాను. మళ్లీ ఇలాంటి సినిమా వస్తుందో రాదో తెలియదు. జీవితాంతం గుర్తుండిపోయే సినిమాను సాయి రాజేష్ గారు ఇచ్చారు' అని అన్నారు.
 
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ప్రీమియర్స్ ఓపెన్ చేయగానే ఫుల్ అయ్యాయి. మీ అన్నలా మాస్ సినిమాలు చేయొచ్చు కదా? అని అందరూ నన్ను అడుగుతుంటారు. ఓ పదిమందిని కొడితే మాస్ హీరోనా? ఊరిని కాపాడితే మాస్ హీరోనా? ప్రేమలో నిజాయితీగా ఉండటమే కానీ నా దృష్టిలో మాస్. ఓ మెట్టు దిగి సారీ చెప్పడం కూడా మాసే. ఆ కోణంలో బేబీ మంచి మాస్ మూవీ. యూత్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రేమంటే ఏంటి? అని చెప్పే క్రమంలోనే సాయి రాజేష్‌ అన్న ఈ కథను రాసుకున్నారు. సాయి రాజేష్‌ గారి కోణంలో ప్రేమను చూపించబోతోన్నారు అని అన్నారు.