శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (12:37 IST)

'సూయ.. సూయ'.. అనసూయకు బంపర్ ఆఫర్... సెటిల్ చేయని 'విన్నర్' నిర్మాత

సాయిధరమ్ తేజ్, రకుల ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం 'విన్నర్'. ఈ చిత్రంలో బుల్లితెర యాంకర్ అనసూయ ఓ ఐటమ్ సాంగ్‌లో తన అందచందాలను ఆరబోసింది. 'సూయ.. సూయ.. అనసూయ' అంటూ సాగే ఈ పాటలో హీరోతో కలిసి అనసూయ డ్య

సాయిధరమ్ తేజ్, రకుల ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం 'విన్నర్'. ఈ చిత్రంలో బుల్లితెర యాంకర్ అనసూయ ఓ ఐటమ్ సాంగ్‌లో తన అందచందాలను ఆరబోసింది. 'సూయ.. సూయ.. అనసూయ' అంటూ సాగే ఈ పాటలో హీరోతో కలిసి అనసూయ డ్యాన్స్ వేస్తుంది. అయితే, ఈ పాటకు సంబంధించిన పూర్తి డబ్బులు అనసూయకు ఇంకా చెల్లించలేదట. 
 
వాస్తవానికి ఈ పాట కోసం రూ.14 లక్షలను అనసూయకు ఆఫర్ చేశారట. అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు చెల్లించారట. అయితే, అనుకున్న సమయానికి పాట షూటింగ్ పూర్తి కాకపోవడంతో... మరో మూడు రోజులు అదనంగా పని చేయాల్సి వచ్చిందట. దీనికి గాను, అదనంగా మరో రూ.6 లక్షలు ఇస్తామని దర్శకనిర్మాతలు హామీ ఇచ్చారట. 
 
అంటే అనసూయకు ఇంకా రూ.‌10 లక్షలు రావాలన్నమాట. కానీ, చిత్ర నిర్మాత కానీ, దర్శకుడు కానీ ఈ డబ్బు ఊసే ఎత్తడం లేదట. సినిమా ప్రమోషన్లకు, ప్రీరిలీజ్ ఈవెంట్లకు తాను హాజరవుతున్నా... వారు మాత్రం తనకు రావాల్సి సొమ్ముపై మాట్లాడకపోవడంతో అనసూయ చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోందట.