శుక్రవారం, 21 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 14 మే 2024 (15:22 IST)

దిల్ రాజు తన వారసుడు ఆశిష్ ను నిలబెడతాడా?

Ashish, Vaishnavi
Ashish, Vaishnavi
నిర్మాతగా హీరోలతో సినిమాలు తీసే దిల్ రాజు తన కుటుంబంలో తన సోదరుని కుమారుడు ఆశిష్ ను హీరోగా చేశాడు. రౌడీ బాయ్స్ సినిమా తీశాడు. అధి యూత్ ఫుల్ సినిమాగా పర్లేదు అనిపించుకుంది. ఆ తర్వాత కొంత గేప్ తీసుకుని పెండ్లి కూడా చేసేసుకున్నాడు. మరి ఇప్పుడు హీరోగా లవ్ మీ.. ఇఫ్ యు డేర్’ అనే పేరుతో సినిమా తీశాడు. అయితే ఇప్పుడు చాలామంది నిర్మాతలు హీరోగా మారిన తరుణంలో తన వారసుడిని హీరోగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎక్కడో ఏదో లోపంతో బెడిసి కొడుతుంది.
 
ఒకటి రెండు సినిమాలకంటే దాదాపు పది సినిమా చేశాక హిట్ కొట్టిన హీరోలు వున్నారు. అందుకే ఆచితూచి స్టెప్ వేయాలంటారు. కనుక ఇప్పుడు ఆశిష్, వైష్ణవి చైతన్య చిత్రం ‘లవ్ మీ.. చిత్రం పూర్తయింది. విడుదలకు సిద్ధమంటు ప్రకటించారు. కానీ మరలా వాయిదా వేశారు.  అందుకు కారణం షూటింగ్ కొంత పార్ట్ కు దిల్ రాజు శాటిస్ ఫై కాలేదని తెలుస్తోంది. అందులో మరలా  రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. మే 25న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ నేటి ట్రెండ్ కు తగినట్లు కొంత లేదని ఆఘమేఘాలపై రీ షూట్ చేస్తే అనుకున్న టైం కు రిలీజ్ చేస్తారనీ, లేదంటే మరో వారం పొడిగించే వీలుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అయితే ఈ సినిమా విడుదలకుముందే మరో సినిమా నిర్మిస్తున్నట్లు సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రకటించింది. అంటే హీరో బిజీ అనేంతగా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.