గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 16 మే 2017 (11:40 IST)

'బాహుబలి 2' వసూళ్లు రూ.1500 కోట్లే... నష్టాలు భర్తీ కావొచ్చు : నిర్మాత దేవినేని ప్రసాద్

బాహుబలి 2 చిత్రం కనకవర్షం కురిపిస్తోంది. కానీ, ఈ చిత్ర వసూళ్లపై ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ స్పందించారు. బాహుబలి మొదటి భాగంలో వచ్చిన నష్టాలు బాహుబలి 2 చిత్రం ద్వారా భర్తీ అవుతాయని ఆయన చ

బాహుబలి 2 చిత్రం కనకవర్షం కురిపిస్తోంది. కానీ, ఈ చిత్ర వసూళ్లపై ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ స్పందించారు. బాహుబలి మొదటి భాగంలో వచ్చిన నష్టాలు బాహుబలి 2 చిత్రం ద్వారా భర్తీ అవుతాయని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ....  ఈ సినిమా ఇప్పటి వరకూ వెయ్యి కోట్లు వసూలు చేసిందని రాబోయే రోజుల్లో అది 1500 కోట్లు వసూలు చేయడం ఖాయమని చెప్పారు. అయితే, ‘బాహుబలి’ మొదటి భాగం ద్వారా దాదాపు 70 కోట్లు న‍ష్టం వచ్చిందని చెప్పుకొచ్చారు.
 
ముఖ్యంగా.. మొదటి భాగం అన్ని రూ.వందల కోట్లు వసూలు చేసినా నష్టం ఎలా వచ్చిందో ఇప్పటివరకూ చాలా మందికి అర్థం కాని ప్రశ్నే! అప్పుడు ఆయన మాటలు నమ్మిన వారే ఇప్పుడు ఈ మాటలను నమ్ముతున్నారు. ఈ దెబ్బతో గతంలో వచ్చిన నష్టాలు పూడతాయని మాత్రం ఈయన చెప్పకపోవడం విశేషమే అంటున్నారు.