గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (14:40 IST)

ప్రభాస్ సాహోలో హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్.. దేవసేనను పక్కనబెట్టినట్టేనా?

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దేవసేన అనుష్క నటిస్తుందని జోరుగా ప్రచారం

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా దేవసేన అనుష్క నటిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అనుష్కను నిర్మాతలు ఖరారు చేయలేదని.. ఆమె స్థానంలో బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను సాహో హీరోయిన్‌గా కన్ఫామ్ చేశారని టాక్. 
 
బాహుబలితో వచ్చిన పేరును అదే స్థాయిలో నిలబెట్టుకునేందుకు ప్రభాస్ ఆచితూచి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ సాహో చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. 
 
బాలీవుడ్ హీరోయిన్లను ఎంచుకుంటే మూడు భాషల వారిని కాంప్రమైజ్ చేయవచ్చుననే నెపంతో.. శ్రద్ధా కపూర్‌ను సాహో హీరోయిన్‌గా ఖరారు చేసేందుకు సంప్రదింపులు చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు శ్రద్ధా కపూర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక సాహో విలన్‌గా కత్తి నీల్ నితిన్ ముకేష్ నటిస్తున్నాడు.