ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (12:22 IST)

శ్రీదేవిపై బయోపిక్ వద్దు.. డాక్యుమెంటరీనే చేద్దాం: బోనీ కపూర్

దివంగత నటి శ్రీదేవిపై డాక్యుమెంటరీ సిద్ధం చేసేందుకు ఆమె భర్త బోనీ కపూర్ సిద్ధమవుతున్నారు. బాలనటి నుంచి హీరోయిన్‌గా ఎదిగి.. అగ్ర హీరోయిన్‌గా వెండితెరను ఏలిన శ్రీదేవి.. ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ప్రాణాలు క

దివంగత నటి శ్రీదేవిపై డాక్యుమెంటరీ సిద్ధం చేసేందుకు ఆమె భర్త బోనీ కపూర్ సిద్ధమవుతున్నారు. బాలనటి నుంచి హీరోయిన్‌గా ఎదిగి.. అగ్ర హీరోయిన్‌గా వెండితెరను ఏలిన శ్రీదేవి.. ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆమె మరణించిన వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
ఇక శ్రీదేవి మృతితో షాక్ అయిన ఆమె భర్త బోనీ కపూర్.. శ్రీదేవిపై డాక్యుమెంటరీ చేసే పనిలో వున్నారట. శ్రీదేవి బయోపిక్‌పై ఇప్పటికే నిర్మాతలు కూడా బోనీని సంప్రదించారని.. అయితే శ్రీదేవి జీవితంలోని మలుపులను రెండు గంటల్లో చెప్పడం కష్టం కావడంతో.. శ్రీదేవిపై డాక్యుమెంటరీనే బెస్ట్ అని బోనీ కపూర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.