మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (18:06 IST)

శ్రీదేవి కూతురు నిజంగానే అలా చేసిందా..? (video)

తెలుగు, తమిళ, హిందీ సినీపరిశ్రమలో నటి శ్రీదేవి క్రేజ్ గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ బాషల్లో కన్నా హిందీ సినీపరిశ్రమలో అభిమానుల సంఖ్యే ఎక్కువ. అంతేకాదు ఆమెకు అవకాశాలు వచ్చిన పరిశ్రమ కూడా అదే. అయినా సరే తెలుగులో ఒక్క ఛాన్స్ వచ్చినా శ్రీదేవి ఏ మాత్రం ఆలోచించేది కాదు. వెంటనే కాల్షీట్లు ఇచ్చేసి సినిమా షూటింగ్‌కు రెగ్యులర్‌గా వచ్చేది.
 
శ్రీదేవి మరణానంతరం ఆమెను జాన్వీకపూర్‌లో చూసుకుంటున్నారు ప్రేక్షకులు. దడక్ సినిమాతో విజయాన్ని సాధించిన జాన్వీకపూర్ ఆ తరువాత కరణ్ జోహార్ దర్సకత్వంలో నటిస్తున్నారు. తెలుగులో ఆమెతో నటించేందుకు మహేష్ బాబు, రాంచరణ్‌లు ఉత్సాహం చూపించారు. కానీ ఆమె తెలుగు సినీపరిశ్రమలో సినిమాలు చేయడానికి ముందుకు రావడంలేదట.
 
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని సాధించుకున్న పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఒక సినిమా ప్లాన్ చేశాడట. ఆ సినిమాలో జాన్వీకపూర్‌ను తీసుకోవాలన్నది పూరీ ఆలోచన. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండకు చెప్పాడు. అతని కాల్షీట్లు తీసుకున్నాడు. ఇక జాన్వీకపూర్ కాల్షీట్ కోసం ఆమె తండ్రి బోనీకపూర్‌కు ఫోన్ చేశాడట. తన కూతురితో మాట్లాడి తరువాత చెబుతానన్నాడట.
 
అయితే బోనీ కపూర్ పూరీ జగన్నాథ్‌తో మాట్లాడేందుకు కాస్త సమయం పట్టింది. ఈ గ్యాప్‌లో తెలుగు సినీపరిశ్రమలో జాన్వీకపూర్‌పై ప్రచారం ప్రారంభమైంది. ఆమె తెలుగు సినిమాలు చేయడానికి ఇష్టం పడడం లేదన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఇది కాస్త బోనీ కపూర్‌కు తెలిసింది. ఆమె తెలుగు సినిమాలను చేయనని చెప్పడం లేదు. ఆలోచనలో ఉంది. కాల్షీట్లు లేవు. చాలా బిజీగా ఉంది. అందుకే సమయం తీసుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న  శ్రీదేవి అభిమానులు మాత్రం జాన్వీకపూర్ తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించాలని కోరుకుంటున్నారు. మరి శ్రీదేవి కుమార్తె ఏం చేస్తుందో చూడాలి.