ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (12:55 IST)

కుమార్తె ఆటలు ఆడుకుంటున్న స్టైలిష్ స్టార్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీ లైఫ్‌ని మాత్రం అస్సలు మిస్ కాకుండా చూసుకుంటాడు. కొడుకు అయాన్ - కూతురు ఆర్హ పక్కన ఉంటే బన్నీ కూడా చిన్న పిల్లాడైపోతాడు. ఇటీవల కూతురితో బన్నీ గడిపిన ఒక లవ్లీ సీన్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.
 
బన్నీ ‘ఓన్లీ వన్స్.. ఫసక్’ అని చెప్పిన డైలాగ్‌కి కూతురు ఆర్హ కూడా ముద్దు ముద్దు మాటలతో అదే తరహాలో చెబుతూ తండ్రిని దువ్వెనతో ఫసక్ అని చూపించిన హావభావాలు క్యూట్‌గా ఉన్నాయి. 
 
ఇందుకు సంబందించిన తండ్రి కూతుళ్ళ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో 'అల.. వైకుంఠపురములో..' అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.