కన్నకూతురిపై అలాంటి వీడియోలు చూపించి అత్యాచారం.. ఐదేళ్లు జైలు

Last Updated: శనివారం, 17 ఆగస్టు 2019 (12:34 IST)
కన్నకూతురిపై కన్నేశాడు.. ఓ కీచక తండ్రి. 13 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఆ కామాంధుడైన తండ్రిని ఐదేళ్ల జైలు శిక్షపడింది. ఈ ఘటన యాద్రాద్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రికి చెందిన ఓ గుడి పూజారి తన కన్నకూతురిని 2006లో తన బంధువులకు దత్తతకు ఇచ్చాడు. అప్పటి నుంచి వారే ఆ పాపను పెంచుకుంటున్నారు.
 
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ బాలిక తల్లిదండ్రులకు వద్దకు వచ్చింది. ఆ సమయంలో పూజారి తన కన్నకుమార్తె అనే విషయం కూడా మరిచిపోయి.. అభ్యంతరకర వీడియోలు బాలికకు చూపించి..బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక పెంపుడు తల్లికి చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మరింత చదవండి :