ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతు చూస్తానంటున్న హీరోయిన్.. ఏంటి సంగతి?
తెలుగు చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు హీరోయిన్ మీరా చోహ్రా తేరుకోలేని షాకిచ్చింది. జూనియర్ అభిమానుల అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఈమెకు గాయని చిన్మయి శ్రీపాద కూడా మద్దతు పలికింది. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మీరా చోప్రా ఎందుకు వార్నింగ్ ఇచ్చిందో ఓ సారి తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మీరా చోప్రా బంగారం చిత్రంలో నటించింది. ఆమెను లక్ష్యంగా చేసుకుని ఎన్టీఆర్ అభిమానులు ట్వీట్ల దాడికి దిగారు. అసభ్య పదజాలంతో ఆమెని దూషించడమేకాకుండా ఆమె తల్లిదండ్రులని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ మీరా ట్వీట్ చేసింది. పైగా, ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అలాగే, ఎన్టీఆర్‌ని ట్యాగ్ చేస్తూ.. తారక్.. మీ కంటే మహేష్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పినందుకు మీ అభిమానులు నన్ను ఇంతగా వేధిస్తారా? ఇలాంటి అభిమానగణంతో మీరు విజయవంతమైనట్టు భావిస్తున్నారా? మీరు నా ట్వీట్‌కు స్పందిస్తారని అనుకుంటున్నా అంటూ మీరా ట్వీట్ చేసింది.
అయితే మీరాపై ఎన్టీయార్ అభిమానులు తీవ్ర పదజాలంతో దూషణకు దిగుతుండడంతో సింగర్ చిన్మయితో పాటు, ఇతర నెటిజన్లు ఆమెకి మద్దతుగా నిలుస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న చిన్మయి.. మీరా చోప్రాకి మద్దతు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయండని ఆమెకి సలహా ఇచ్చింది. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.