శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 3 జనవరి 2022 (21:03 IST)

హైపర్ ఆది పెళ్ళి చేస్తారట....

జబర్దస్త్‌లో ఒక సాధారణ కమెడియన్‌గా చేరి ఆ తరువాత ఏకంగా టీం లీడర్ అయ్యారు హైపర్ ఆది. తన పదునైన స్కిట్లతో లక్షలాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. హైపర్ ఆది అంటే తెలియని వారు లేకుండా చేశాడు.

 
జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్ వచ్చిందంటే చాలు తెలుగు ప్రజలు టీవీలకు అతుక్కుని పోతుంటారు. అలాంటి వ్యక్తి పెళ్ళి ఎప్పుడన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. హైపర్ ఆది తాజాగా నూతన సంవత్సరం రోజు తన తండ్రిని పరిచయం చేశారు.

 
పరిచయం చేయగానే ఆది తండ్రిని కొంతమంది ప్రశ్నలు వేశారు. మామూలుగానే ఆది ఇలాగే ఉంటాడా.. లేకుంటే ఇంటిల్లిపాది ఉంటాడా అని అడిగారు. అయితే సీరియస్‌గా కాకుండా నవ్వించే విధంగా కాకుండా ఒక విధంగా ఉంటాడని ఆది తండ్రి సమాధానం చెప్పారు.

 
ఆ తరువాత పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చారట. ఇప్పటికే ఒంగోలులో ఒక అమ్మాయిని హైపర్ ఆది కోసం చూశారట. అయితే పెళ్ళిచూపులకు వెళ్లిన ఆది ఆ అమ్మాయి వద్దని చెప్పేశారట. ఇక మళ్ళీ ఒంగోలులోనే మరో అమ్మాయిని కూడా చూశారట. 

 
ఇలా త్వరలోనే ఆదికి పెళ్ళి చేస్తాం. ఆయన ఒకింటివాడు అవుతాడని చెప్పాడట ఆయన తండ్రి. ఇప్పుడిదే ఆసక్తికరంగా మారుతోంది. ఎవరిని ఆది పెళ్ళి చేసుకుంటారన్నది బుల్లితెరపై చర్చకు కారణమవుతోంది. ఎలాగైతేనేం హైపర్ ఆది ఒకింటి వాడు కాబోతున్నాడని తల్లిదండ్రులు సంతోషంతో ఉన్నారట.