ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: ఆదివారం, 8 ఆగస్టు 2021 (19:22 IST)

అందాలు ఆరబోస్తేనే ఆది అవకాశమిస్తాడంటున్న భామ

జబర్దస్త్ స్కిట్‌లో అమ్మాయిలకు బదులు అబ్బాయిలు వేషం వేసుకుని నటిస్తూ ఉంటారు. ఆడవేషంలో మగవారు నటిస్తే ఆ కామెడీనే వేరుగా ఉంటుంది. అందులోనూ హైపర్ ఆది స్కిట్ అంటే చెప్పనవసరం లేదు. కడుపుబ్బ నవ్వుకోవాల్సిందే.
 
అయితే ఈ మధ్య ఇమ్మానుయేల్‌ను ఉద్దేశించి ఒక స్కిట్ చేశారు హైపర్ ఆది. అందులో వర్ష క్యారెక్టర్‌ను ఒక అమ్మాయి చేసింది. ఆమె పేరు రీతు చౌదరి. ఎంతో అందంగా కనిపిస్తున్న రీతు నటనను ప్రశంసించారు తెలుగు ప్రేక్షకులు.
 
అయితే ఈమధ్య రీతు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ లోను, బుల్లితెరపై ఒక సీరియల్‌లో నటిస్తున్న రీతు అందంగా ఉంటేనే కదా అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు అందాలు ఆరబోస్తేనే హైపర్ ఆది అవకాశం ఇచ్చాడని చెప్పారు.
 
జబర్దస్త్ వల్ల తనకు ఈ స్థాయిలో పేరు వస్తుంది ఎప్పుడూ ఊహించలేదన్న రీతూ మళ్లీ మళ్లీ తనకు అవకాశం వస్తుందని అనుకోవడం లేదన్నారు. ఒక ఎపిసోడ్ తోనే తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రీతు.
 
అయితే ఎప్పటికైనా నా తన టాలెంట్‌కు మంచి అవకాశం వస్తుందని.. మళ్లీ తన కెరీర్ ప్రారంభమవుతుందన్న నమ్మకంతో ఉన్నారట. కానీ రీతు తాజాగా హైపర్ ఆదిపై చేసిన వ్యాఖ్యలు మాత్రం అభిమానుల్లో కోపం తెప్పిస్తుండగా బుల్లితెరపై ఇది కాస్త పెద్ద చర్చకు దారితీస్తోంది.