ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (15:58 IST)

బిగ్ బాస్ తెలుగు చీటింగ్ చేస్తోందా? స్మోకింగ్ జోన్‌లో వాషింగ్‌ మెషీన్

తమిళ బిగ్ బాస్ షోలో ఓవియా అనే నటి.. మానసిక ఒత్తిడి కారణంగా ఆ షో నుంచి బయటపడిన నేపథ్యంలో.. తెలుగు బిగ్ బాస్ షో కూడా కూడా వుత్తుత్తిదేనని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో సూపర్ హిట్ షోగా బిగ్ బాస్ రేటిం

తమిళ బిగ్ బాస్ షోలో ఓవియా అనే నటి.. మానసిక ఒత్తిడి కారణంగా ఆ షో నుంచి బయటపడిన నేపథ్యంలో.. తెలుగు బిగ్ బాస్ షో కూడా కూడా వుత్తుత్తిదేనని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో సూపర్ హిట్ షోగా బిగ్ బాస్ రేటింగ్‌లో దూసుకెళ్తోంది. తాజాగా తెలుగు బిగ్ బాస్ మీద ఇప్పుడు సరికొత్త అపవాదు వినిపిస్తోంది. ఈ టీవీ షోలో ఉన్న స్మోకింగ్ జోన్‌లో ఓ కనపడకూడని వస్తువు కనిపిస్తోంది. 
 
బిగ్ బాస్ ఇంగ్లీష్, హిందీషోల్లో చాలా మోసాలు జరిగిన సంఘటనలున్నాయి. తెలుగులో కూడా అలాంటిదే జరిగిందని టాక్. ఆ వస్తువు కనపడగానే ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఇంతకీ అదేంటంటే.. వాషింగ్ మెషీన్.  బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొనే వారు.. ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి. కానీ ఇలా వాషింగ్ మెషీన్ కనిపించడంతో అందరికీ షాక్ తిన్నారు. వాషింగ్ మెషీన్‌ షో నిర్వాహకులు మోసం చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 
 
ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో స‌క్సెస్ ఫుల్ రేటింగ్‌తో దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. 14 మంది పార్టిసిపెంట్స్‌తో ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టికే ముగ్గురు నిష్క్ర‌మించ‌గా, తాజాగా దీక్షా హౌజ్ మేట్స్‌తో జాయిన్ అయింది.