శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (13:51 IST)

విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తున్న జాగ్వార్.. ఫస్ట్ టిక్కెట్ రూ.10 లక్షలు

జాగ్వార్ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్

జాగ్వార్ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ చెన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న భారీ చిత్రం 'జాగ్వార్‌'.

'బాహుబలి', 'భజరంగి భాయ్‌జాన్‌' చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన గొప్ప కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ 'జాగ్వార్‌' చిత్రానికి కథ అందించారు. ఎ.మహదేవ్‌ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌, మాటలు, దర్శకత్వం చేస్తున్నారు. 50కి పైగా చిత్రాలకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ చేసిన యస్‌.యస్‌. థమన్‌ ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు వర్క్‌చేసిన నారాయణరెడ్డి కళా దర్శకత్వం వహిస్తున్నారు. 
 
నిఖిల్‌కుమార్‌, దీప్తి హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్ర పోషిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి, దసరా కానుకగా అక్టోబర్‌ 6న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నారు. అయితే ఈ సినిమా టికెట్స్ కోసం చిత్ర యూనిట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భారీ రెస్పాన్స్ వచ్చింది. 
 
ఇందులో భాగంగా మైసూర్‌కు చెందిన లోకేష్ అనే వ్యక్తి 'జాగ్వార్' సినిమా మొదటి టికెట్‌ను రూ.10 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, 'జాగ్వార్' విడుదల రోజున టికెట్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి పేరును ప్రకటించనున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో సుమారు 16 దేశాలలో వెయ్యికి పైగా స్క్రీన్లలో విడుదల చేసేలా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.