అర్జున్ రెడ్డితో జాన్వీ కపూర్.. (video)
అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దివికేగిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది.
ఇందులో భాగంగా శ్రీదేవీ కుమార్తెను విజయ్ సరసన నటింపజేస్తే.. సినిమా తప్పకుండా హిట్ అవుతుందని పూరీ యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఛార్మి.. జాన్వీతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఆమె గనుక అంగీకరిస్తే సినిమాకు హైప్ వస్తుందని భావిస్తున్నారు.
ఇటీవల ఓ టీవీ షోలో జాన్వీ టాలీవుడ్‌లో తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని, అతడి కలిసి నటించే ఛాన్స్ వస్తే వదులుకోనని చెప్పింది. మరి ఆ ఛాన్స్ ప్రస్తుం ఆమె ఇంటి తలుపు తడుతోంది. మరి ఈ ఛాన్సును జాన్వీ ఉపయోగించుకుని టాలీవుడ్ తెరంగేట్రం చేస్తుందో లేదో వేచి చూడాలి.