మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (11:39 IST)

శృతిహాసన్‌ను కిడ్నాప్ చేయబోయారు : కమల్ హాసన్

విశ్వనటుడు కమల్ హాసన్. తమిళ 'బిగ్‌బాస్' కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన తాజాగా ఓ సంచలన వార్తను వెల్లడించారు. తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన శృతిహాసన్, అక్షర హాసన్‌లలో ఒకరిని కిడ్నాప్ చేయ

విశ్వనటుడు కమల్ హాసన్. తమిళ 'బిగ్‌బాస్' కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన తాజాగా ఓ సంచలన వార్తను వెల్లడించారు. తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన శృతిహాసన్, అక్షర హాసన్‌లలో ఒకరిని కిడ్నాప్ చేయబోయారంటూ ఆయన ప్రకటించారు. 
 
తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ కొత్త కథ తయారు చేసుకోవాలని తాను భావిస్తున్న వేళ, పనివాళ్లు తన బిడ్డను కిడ్నాప్ చేయాలని చూశారని, అదృష్టవశాత్తూ వారి మోసం గురించి తెలుసుకున్న తాను కాపాడుకోగలిగానని తెలిపారు. 
 
ఈ కిడ్నాప్ విషయం తెలిసి వారిని చంపేయాలన్నంత కోపం వచ్చిందని, ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యమనిపించి ఆగిపోయానని అన్నారు. కూతురి విషయంలో కలిగిన భయమే మహానది కథగా మారిందని చెప్పుకొచ్చారాయన. 
 
ఈ సంఘటన 1994 నాటి బ్లాక్ బస్టర్ చిత్రం (మహానది)కి ప్రేరణగా నిలిచిందన్నారు. ఇప్పుడు తన కుమార్తెలు పెద్దవాళ్లయ్యారు కాబట్టి, తాను ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నానో, అలానే వారూ అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.