శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 మే 2017 (12:01 IST)

అర్జున్ కపూర్‌తో సంబంధం ఉందా? గాసిప్‌లు సృష్టించాల్సిన అవ‌స‌రం ఏముంది: మలైకా

బాలీవుడ్ న‌టుడు అర్జున్ క‌పూర్‌తో త‌న‌కు అఫైర్ ఉందంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా ఖాన్ స్పందించింది. పుకార్లు సృష్టించాల్సిన అవసరం ఏముందన్నారు. మాట్లాడే వాళ్ల‌ను మాట్లాడుకోనీయాల‌ని

బాలీవుడ్ న‌టుడు అర్జున్ క‌పూర్‌తో త‌న‌కు అఫైర్ ఉందంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరా ఖాన్ స్పందించింది. పుకార్లు సృష్టించాల్సిన అవసరం ఏముందన్నారు. మాట్లాడే వాళ్ల‌ను మాట్లాడుకోనీయాల‌ని చెప్పుకొచ్చింది. 
 
కాగా, తాము విడిపోతున్న‌ట్టు మ‌లైకా, అర్బాజ్ ఖాన్‌లు గ‌తేడాది ప్ర‌క‌టించి అభిమానుల‌ను షాక్‌కు గురిచేశారు. అప్ప‌టినుంచి ఇప్ప‌టివ‌ర‌కు మలైకాకు సంబంధించిన వార్త ఏదో ఒక వార్త‌ బాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. 
 
భర్తతో తెగదెంపులు చేసుకున్న తర్వాత హీరో అర్జున్ క‌పూర్‌తో మ‌లైకాతో తిరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్త‌ల‌పై స్పందించిన మ‌లైకా మాట్లాడుతూ ప్ర‌తి ఒక్క‌రు ఈ వార్త‌లు విని న‌వ్వుకుంటున్నార‌ని పేర్కొంది.