మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2018 (12:05 IST)

మిడిల్ క్లాస్ అబ్బాయికి తర్వాత ఆ ఇద్దరు బాగా పెంచేశారు..

ఫిదాతో సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేసింది. అలాగే వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని కూడా పారితోషికాన్ని పెంచాడు. వరుస సక్సెస్‌లతో మార్కెట్ పరంగా దూసుకెళ్తున్న నాని, సాయిపల్లవి.. కథా ప్రా

ఫిదాతో సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేసింది. అలాగే వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని కూడా పారితోషికాన్ని పెంచాడు. వరుస సక్సెస్‌లతో మార్కెట్ పరంగా దూసుకెళ్తున్న నాని, సాయిపల్లవి.. కథా ప్రాధాన్యత గల సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకు నాని 8 కోట్లు తీసుకున్న నాని.. ప్రస్తుతం తొమ్మిది కోట్లు అడుగుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
అలాగే ఫిదా హీరోయిన్ సాయిపల్లవి కూడా సక్సెస్‌ల కోసం ఉరుకులు తీస్తోంది. ఈ క్రమంలో పారితోషికాన్ని కోటి నుంచి కోటిన్నరకు పెంచేసిందని సినీ జనం అంటున్నారు. నాని ప్రస్తుతం ''కృష్ణార్జున యుద్ధం'' సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నారు. 
 
ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. అలాగే నాని నిర్మాతగా తెరకెక్కించిన ''అ'' సినిమా ఆడియో వేడుక ఇటీవల జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.