బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2017 (14:35 IST)

నాని 'కృష్ణార్జున యుద్ధం'లో అనుపమ పరమేశ్వరన్..?

నిన్నుకోరి ద్వారా ఇటీవల హిట్ కొట్టిన నాని.. వరుస హిట్లొచ్చినా ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా అందిన సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా నాని ''మిడిల్ క్లాస్ అబ్బాయి" సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ని

నిన్నుకోరి ద్వారా ఇటీవల హిట్ కొట్టిన నాని.. వరుస హిట్లొచ్చినా ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా అందిన సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా నాని ''మిడిల్ క్లాస్ అబ్బాయి" సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.
 
ఆపై నాని మేర్లపాక గాంధి దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో నాని రెండు పాత్రలను పోషించనుండగా, ఒక పాత్ర సరసన అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 
 
అనుపమ పరమేశ్వరన్ ఏ ముహూర్తంలో తెలుగు తెరకి పరిచయమైందో గానీ, హిట్స్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటోంది. దీంతో అనుపమను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే అ.. ఆ, శతమానం భవతి, ప్రేమమ్ వంటి సినిమాల్లో నటించిన అనుపమ రామ్‌కు జోడీగా 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా చేస్తోంది. ఈ సినిమా పూర్తవగానే నానితో అనుపమ జత కట్టనుంది.