బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: బుధవారం, 19 సెప్టెంబరు 2018 (18:52 IST)

డైరెక్టర్లు, నిర్మాతల ఇళ్ళలోకి వెళ్లిపోతున్న నాని.. ఎందుకు..?

నాని గత మూడునెలలుగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో ఎండ్ అవుతోంది. ఈ షో కోసం సినిమాలు తగ్గించుకున్నాడు. నిన్నటి వరకు స్లో అయిన నాని ఇక స్పీడ్ పెంచనున్నాడు. దసరా స్పెషల్‌గా కొత్త సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. టీవీ షో హోస్ట్‌గా నానికి మంచి రెస్పాన్

నాని గత మూడునెలలుగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో ఎండ్ అవుతోంది. ఈ షో కోసం సినిమాలు తగ్గించుకున్నాడు. నిన్నటి వరకు స్లో అయిన నాని ఇక స్పీడ్ పెంచనున్నాడు. దసరా స్పెషల్‌గా కొత్త సినిమాలు  చేయడానికి సిద్ధమవుతున్నాడు. టీవీ షో హోస్ట్‌గా నానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదట్లో బ్యాడ్ టాక్ వచ్చింది కానీ రెండవ వారం నుంచి నాని తన సత్తా చాటడం మొదలెట్టాడు.
 
తొందరలోనే హోస్ట్‌గా నిలదొక్కుకున్నాడు. బిగ్ బాస్ షో కోసం బాగా స్లో అయ్యాడు. ఈ యేడాది ఇప్పటివరకు ఒకే ఒక్క చిత్రంలో నటించాడు. రెండవ సినిమా దేవదాసు ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. 
 
బిగ్ బాస్ షో ఈ నెలాఖరున పూర్తవుతుండటంతో ఇక స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్నాడు నాని. ఫాస్ట్‌గా కొన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాడట. దసరా నాడు జెర్సీ అనే సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాలో మిడిల్ యేజ్ క్రికెటర్‌గా కనిపించబోతున్నాడట. ఇదిలావుంటే అవకాశాలు కోసం డైరెక్టర్లు, నిర్మాతల ఇళ్ళకు వెళ్లిపోతున్నాడట నాని.