శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 మే 2017 (14:08 IST)

డైరక్షన్‌పై మోజు పుట్టిందా? అయినా ఎలా రాస్తారండి బాబూ...

నిత్యామీనన్‌కు దర్శకత్వంపై మోజు పుట్టిందని.. అందుకే నటిగా అవకాశాలు వచ్చినా తిరస్కరిస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై నిత్యామీనన్ స్పందించింది. ప్రస్తుతం కోలీవుడ్ హీరో

నిత్యామీనన్‌కు దర్శకత్వంపై మోజు పుట్టిందని.. అందుకే నటిగా అవకాశాలు వచ్చినా తిరస్కరిస్తోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై నిత్యామీనన్ స్పందించింది. ప్రస్తుతం కోలీవుడ్ హీరో విజయ్‌ సరసన నటిస్తున్న నిత్యామీనన్.. తాను దర్శకత్వం వహిస్తానని ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి ప్రచారాలు కూడా చేస్తారా? అయినా ఇలాంటి వార్తలను ఎలా రాస్తారండి బాబు అంటూ ప్రశ్నించింది. 
 
అలాగే ఛాలెంజింగ్ పాత్రలు చేయాలన్న కోరిక తనలో ఇంకా ఉందని.. నటిగా రాణించాలనే ఉద్దేశంతో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నానని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. కానీ తనను దర్శకురాలిగా చూడాలనే తపన చాలామందిలో ఉందనే విషయం తెలియవచ్చిందని.. అలాంటి వారి కోసం భవిష్యత్తులో దర్శకత్వం గురించి కూడా ఆలోచిస్తానని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.