శనివారం, 16 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (12:42 IST)

రహస్యంగా రాజకీయ పార్టీనా.. బహిరంగంగానే ప్రకటిస్తా.. తారక్..?

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెడతారని వస్తున్న వార్తలపై స్పందించారు. రహస్యంగా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం తనకు లేదని తారక్ సన్నిహితులతో చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదీ వేరే పార్టీని

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెడతారని వస్తున్న వార్తలపై స్పందించారు. రహస్యంగా రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం తనకు లేదని తారక్ సన్నిహితులతో చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదీ వేరే పార్టీని ఆధారంగా చేసుకుని కొత్త పార్టీ పెట్టనని తేల్చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నవ భారత్ నేషనల్ పార్టీ పెట్టబోతున్నారని.. అందుకు అధ్యక్షత వహిస్తారని ఓ లేఖ నెట్లో హల్ చల్ చేసింది. 
 
దీంతో తారక్ ఫ్యాన్స్ ఆయన్ని కలిశారు. ప్రస్తుతం జైలవకుశ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్ రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు వచ్చిన వార్తలను తెలుసుకుని నవ్వుకున్నట్లు సమాచారం. ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోనని.. ప్రస్తుతానికి తన దృష్టంతా సినిమాలపైనే వుందని చెప్పాడట. 
 
ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పినట్లు తెలిసింది. అంతేగాకుండా రాజకీయాల్లో రావాలంటే బహిరంగ ప్రకటన చేస్తానని.. ఇలా రహస్య రాజకీయాలుండవని తారక్ తేల్చేశాడట. ఇంకా సోషల్ మీడియాలో గల లేక నకిలీదని కూడా వార్తలు వస్తున్నాయి.