సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (17:48 IST)

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ చిత్రం పేరు ఇదే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్ పతాకంపై నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్ పతాకంపై నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్లుగా నివేదా థామస్, అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.
 
అయితే, ఈ చిత్రానికి 'ఇంజనీర్ బాబు' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తొలుత వార్తలు వచ్చాయి. కానీ, ఇపుడు మరో టైటిల్ హల్‌చల్ చేస్తోంది. ఆ టైటిల్ 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలను సమకూర్చుతున్నాడు. 
 
కాగా, వీరిద్దరి కాంబినేషన్‌లో 'జల్సా', 'అత్తారింటికి దారేది' అనే చిత్రాలు వచ్చిన సూపర్ డూపర్ హిట్ సాధించిన విషయం తెల్సిందే. ఇది పవన్ కళ్యాణ్ 25వ చిత్రం. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ టీజర్‌ను పవన్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన విషయం తెల్సిందే.