పవన్ కళ్యాణ్ నాయిక ఇప్పుడు చిరంజీవితో!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్, కాటమరాయుడుచిత్రాల్లో నటించిన శ్రుతిహాసన్ తాజాగా మెగాస్టార్ చిరంజీవితో నటించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాలో రవితేజ సరసన నటించిన శ్రుతి హాసన్ ఇప్పుడు మరలా అదే దర్శకుడి కొత్త సినిమాలో నటిస్తోంది కూడా. ప్రభాస్ సలార్‌లో కూడా నటిస్తున్న ఈమె మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించనుంది.
మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నటీమణుల ఎంపిక మొదలైంది. కథానాయికగా శ్రుతి హాసన్ ను ఎంపిక బాగుంటతుందని దర్శకుడు సూచన మేరకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమెకూడా సిద్ధమైనట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలో దీని గురించి అధికారికంగా ప్రకటన రానున్నదని తెలుస్తోంది.