శుక్రవారం, 28 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (14:12 IST)

చిరంజీవి పెత్తనం ఎవరికి కావాలి.. మోహన్ బాబు, బాలకృష్ణ ఐతే బాగుంటుంది?

ఇంతవరకు మెగాస్టార్ చిరంజీవిపై నోరెత్తని శ్రీరెడ్డి ప్రస్తుతం ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేసింది. పెద్దరికంపై వస్తున్న మాటలను దృష్టిలో పెట్టుకొని "నీ బోడి పెత్తనం ఎవరిని కావాలి" అంటూ మెగాస్టార్ చిరంజీవిపై శ్రీ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం వైరల్‌గా మారడమే కాదు దుమారం రేపుతున్నాయి.
 
సినీ ఇండస్ట్రీలో పెద్దరికం గురించి ఒక ఇంటర్వ్యూలో శ్రీ రెడ్డిని ప్రశ్నించగా ఆమె చిరంజీవిపై ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ పెద్దరికం ఎవడు అడిగాడు? బోడి పెద్దరికం నాకు అర్థం కాదు. మీకు మీరు పెద్దరికం తీసుకున్నట్లున్నారు. 
 
అసలు ఎక్కడికైనా వెళ్లాలంటే చాపర్ ఫ్లైట్స్ వేసుకుని వీళ్లు బయలుదేరిపోతారు. ప్రొడ్యూసర్‌కి వచ్చిన సమస్యలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు వచ్చిన సమస్యలు కావచ్చు. మీకు సమస్యలు వస్తే ఎవరు తీర్చలేరు. 
 
కేవలం ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని ప్రసన్న కుమార్ ఉంటారు ఆయన మాత్రమే నిర్మాతల సమస్యలను తీర్చగలరు. మోహన్ బాబు, బాలకృష్ణ లాంటి వాళ్లు మాత్రమే సినీ ఇండస్ట్రీకి పెద్ద అయితే బాగుంటుంది.. మరెవరూ కూడా ఆ స్థానానికి అర్హులు కాదు" అంటూ ఘాటుగా స్పందించింది శ్రీ రెడ్డి.