ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (21:33 IST)

బిగ్‌బాస్‌-5లో పాయల్ రాజ్‌పుత్..?

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.. బోల్డ్ ఫిల్మ్ 'ఆర్ఎక్స్ 100'తో అరంగేట్రం చేసింది. అయినా చిత్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించడంలో ఈ బ్యూటీ విఫలమైంది. రవితేజ, వెంకటేష్‌ లాంటి స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసింది. కానీ, అవికూడా తన కెరీర్‌కు ఎలాంటి మార్పును చూపించలేకపోయాయి. 
 
అయితే తాజాగా ఈ ఆర్‌ఎక్స్‌ 100 బ్యూటీ పై ఓ వార్త నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. త్వరలో తెలుగులో మొదలయ్యే బిగ్‌బాస్‌ 5 లో పాల్గొంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు బిగ్‌బాస్‌ మేకర్స్ పాయల్ రాజ్‌పుత్ సంప్రదించారంట. అయితే, ఈ బ్యూటీ నుంచి ప్రస్తుతానికి ఎటువంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. 
 
పాయల్ ప్రస్తుతం పంజాబీలో ఓ సినిమా చేస్తుంది. అలాగే పలు తెలుగు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. మరి బిగ్‌బాస్‌ అయిన తనకు మరిన్ని అవకాశాలను అందిస్తుందో లేదో చూడాలి.