బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (09:19 IST)

దర్శకుడు ఆశించినదానికంటే ఎక్కువగానే చూపించేశా.. ఖాతాలో హిట్ ఖాయం : పూజా హెగ్డే

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం "ముకుంద". ఈ చిత్రం ద్వారా పూజా హెగ్డే తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత చైతూతో చేసిన 'ఒక లైలా కోసం', బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మెగా బడ్జెట్ మూవీ 'మొహ

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం "ముకుంద". ఈ చిత్రం ద్వారా పూజా హెగ్డే తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత చైతూతో చేసిన 'ఒక లైలా కోసం', బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మెగా బడ్జెట్ మూవీ 'మొహెంజోదారో'లో నటించింది. ఇక్కడ విషయమేమిటంటే.. ఈ చిత్రాలన్నీ ఫ్లాప్ సినిమాలే. దీంతో అమ్మడుది ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. 
 
అయినప్పటికీ.. ఈ అమ్మడి చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వుంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న 'డీజే..దువ్వాడ జగన్నాథం' చిత్రం. ఇందులో హీరో అల్లు అర్జున్. ఈ చిత్రంపై పూజా గంపెడు ఆశలు పెట్టుకుంది. అందుకే.. మోతాదుకు మించి అందాలను ఆరబోసినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా దర్శకుడు కోరిక కంటే.. అదనంగానే అందాలను చూపించేసిందట.
 
దీనిపై పూజా స్పందిస్తూ తాను బన్నీకి ఫ్యాన్, బన్నీతో చేయడం లక్కీగా ఫీల్ అవుతున్నానని.. బన్నీ స్వీట్ పర్సన్ అంటూ కితాబిస్తోంది. అంతేకాదు ఈ మూవీ హిట్ కావడం పక్కా అంటోంది కూడా. దీనికి కారణం అమ్మడు ఆరబోసిన అందాలేనట. కామన్‌గా ఏ హీరోయిన్ అయినా వరుసగా రెండు.. మూడు ఫ్లాప్స్ ఇస్తే ఇక అంతే కెరీర్ క్లోజ్. కానీ పూజా హెగ్డే మాత్రం ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.