సంబంధిత వార్తలు
- తొలి ముద్దు అనుభవం అదుర్స్... డేటింగ్ కూడా చేశా : కంగనా రనౌత్
- బాలీవుడ్లో "సైరా" హవా... పత్తాలేని 'వార్'
- టైగర్ ష్రాఫ్ కంటే ఫర్హార్ అక్తర్‌తో తిరగడమే ఇష్టం : దిశా పటానీ
- పవన్ కళ్యాణ్-బాలయ్య చుట్టూ తిరుగుతున్న బోనీ కపూర్, ఎందుకు?
- అమితాబ్ బచ్చన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు... అసలు ఎవరీ ఫాల్కే, ఈ అవార్డు ఎందుకిస్తారు?
పూజా హెగ్దెకి దానిపై ఎందుకంత మోజు?
టాలీవుడ్లో పూజా హెగ్డే బిజీ హీరోయిన్. నటిస్తున్న సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే. అరవింద సమేత, మహర్షి, గద్దల కొండ గణేష్ ఇలా వరుస విజయాలు పూజా హెగ్డేకు తెలుగు చిత్ర సీమలో మంచి పేరునే తెచ్చిపెడుతున్నాయి. ఇదంతా పూజా హెగ్డేకు అస్సలు ఇష్టం లేదట.
అందుకు కారణం బాలీవుడ్ అట. ఎప్పటికైనా బాలీవుడ్ లోనే స్థిరపడాలన్నది పూజా ఆలోచన. అందుకే అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లోను నటిస్తోంది. ఆ మధ్య హృతిక్ రోషన్‌తో కలిసి ఒక సినిమా చేసింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. కానీ పూజా హెగ్డేకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో హౌస్‌ఫుల్ 4 సినిమాలో నటిస్తోంది. ఇదొక కామెడీ మూవీ. క్రైరమైన కింగ్ పాత్రలో రానా కనిపిస్తాడు. ఇందులో మరికొంతమంది సీనియర్ నటులు ఉన్నారు. ఇందులో పూజాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా తరువాత తనకు బాలీవుడ్లో అవకాశాలొస్తాయని.. ఇక టాలీవుడ్‌కు రావాల్సిన అవసరం లేదంటోంది పూజా హెగ్డే. తనకు ఇష్టమైన పరిశ్రమ బాలీవుడ్ అంటోంది పూజా. అయితే అక్కడ అవకాశాలు రావడంలేదు కాబట్టి ప్రస్తుతానికి తెలుగు సినిమాల్లో నటిస్తున్నానని చాలా నీరసంగా చెబుతోంది పూజా.
