బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2019 (09:53 IST)

తొలి ముద్దు అనుభవం అదుర్స్... డేటింగ్ కూడా చేశా : కంగనా రనౌత్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. తన తొలి ముద్దు అనుభవాన్ని బహిర్గతం చేసింది. అయితే, తనకు తొలి ముద్దు ఇచ్చిన ప్రియుడు మాత్రం తనకు అస్సలు ఏమాత్రం నచ్చలేదని ముఖంమీదే చెప్పేసింది. సాధారణంగా తొలి ముద్దు ఎవరికైనా జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాగే, కంగనా రనౌత్‌కు కూడా ఆ ముద్దు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఈ విషయంపై ఆమె తాజా స్పందించింది. 
 
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆమె పాల్గొంది. ఇందులో ఆమె తన తొలి ప్రేమకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తాను 17 ఏళ్ల వయసులో చండీగఢ్‌లో ఉంటున్నప్పుడే ఓ పంజాబీ అబ్బాయిని ఇష్టపడి, ముద్దు ఇచ్చినట్టు చెప్పింది. 
 
తన స్నేహితుడు ఓ అబ్బాయితో డేటింగ్‌కు వెళ్లగా, అతని ఫ్రెండ్‌తో తాను ఉండాల్సి వచ్చిందని, అతను చాలా క్యూట్‌గా ఉండేవాడని చెప్పింది. అతనికి తన ప్రేమను గురించి చెప్పగా, తనను చిన్న పిల్లగా చూశాడని, అప్పుడు తన గుండె పగిలినంత పనైందని వాపోయింది.
 
తనకు ఒక్క అవకాశం ఇస్తే, ఎదిగి చూపిస్తానని అతనికి మెసేజ్‌లు పెట్టేదాన్నని, కొన్ని రోజుల డేటింగ్ తర్వాత విడిపోయామని అంది. అప్పట్లో తనకు ముద్దు పెట్టడం కూడా తెలియదని, అరచేతిని ముద్దాడుతూ ప్రాక్టీస్ చేసేదాన్నని, తన తొలి ముద్దు సమయంలో బిగుసుకుపోయానని చెబుతూ, తన టీనేజ్ జ్ఞాపకాలను కంగనా రనౌత్ గుర్తుచేసుకుంది.