బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (20:34 IST)

పల్సర్ బైక్ పాటతో సెలెబ్రిటీ.. ఝాన్సీ పారితోషికం పెంచేసిందట! (వీడియో)

Conductor Jhansi
Conductor Jhansi
సోషల్ మీడియాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన వారిలో కండక్టర్ ఝాన్సీ కూడా ఒకరు. ఇకపోతే ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పల్సర్ బైక్ పాటకు తనదైన శైలిలో మాస్ స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్న ఝాన్సీ ఆంధ్రప్రదేశ్ గాజువాక డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. 
 
అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి రాకముందు ఝాన్సీ అంటే ఆ చుట్టుపక్కల వారికి మాత్రమే తెలిసేది. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఝాన్సీ పర్ఫార్మ్ చేసిన డాన్స్‌కి అందరూ ఫిదా అయ్యారు.
 
ఒక్క డాన్స్‌తో ఝాన్సీ ఓవర్ నైట్‌లో స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఝాన్సీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రమే కాకుండా ఇతర ఎంటర్టైన్మెంట్ షోలలో కూడా అవకాశాలు చేజిక్కించుకుంది. 
 
ఈ క్రమంలో ఝాన్సీ తన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పల్సర్ బైక్ పాట వల్ల పాపులర్ అయిన ఝాన్సీ ప్రస్తుతం ఒక రోజుకి 50 వేల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.