ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఫిబ్రవరి 2025 (14:34 IST)

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

Rani Mukarjee
Rani Mukarjee
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా వున్నారు. అలాగే ఇటీవల దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కొత్త చిత్రానికి సంతకం చేశారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ఈ చిత్రంలో భాగం కావచ్చు. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా కీలకమని టాక్ వస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆమెను ఈ పాత్రకు సిఫార్సు చేశారు. చిరంజీవి తన అనుమతిని ఇచ్చినట్లు సమాచారం.
 
నటుడు నాని ఈ చిత్రాన్ని సమర్పిస్తారని చెబుతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో రాణి ముఖర్జీ పాల్గొనే అవకాశం ఉందనే వార్తలు బాలీవుడ్ వర్గాల్లో కూడా ట్రెండ్ అవుతున్నాయి. చిరంజీవి 158వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-పొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతున్నది. త్వరలోనే నటీనటులను, సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తారట.