సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (17:22 IST)

పెళ్లికి వైజాగ్‌కు లింకులేదు.. పెళ్లి గురించి ఆలోచించట్లేదు: రష్మీ గౌతమ్

మొన్నటికి మొన్న వైజాగ్‌లో స్థిరపడతానని యాంకర్, నటి రష్మీ గౌతమ్ చెప్పింది. దాంతో రష్మీ వైజాగ్ అబ్బాయిని పెళ్లి చేసుకోనుందని సోషల్ మీడియా జోరుగా ప్రచారం సాగింది. వైజాగ్‌కు చెందిన కుర్రాడిని ఆమె వివాహం చ

మొన్నటికి మొన్న వైజాగ్‌లో స్థిరపడతానని యాంకర్, నటి రష్మీ గౌతమ్ చెప్పింది. దాంతో రష్మీ వైజాగ్ అబ్బాయిని పెళ్లి చేసుకోనుందని సోషల్ మీడియా జోరుగా ప్రచారం సాగింది. వైజాగ్‌కు చెందిన కుర్రాడిని ఆమె వివాహం చేసుకుని అక్కడే సెటిల్ కానుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చ సాగింది.

అయితే ఈ వార్తలపై రష్మీ స్పందించింది. వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. తన తల్లిదండ్రులు, బంధువులు అంతా వైజాగ్‌లోనే ఉన్నారని తెలిపింది. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆరు నెలలకు ఒకసారి తాను వైజాగ్‌కు వెళ్తానని చెప్పింది. ప్రస్తుతానికి తాను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు లేవని తేల్చేసింది. 
 
తన పని పట్ల తాను హ్యాపీగా ఉన్నానని.. పెళ్లి గురించి తాను ఆలోచించట్లేదని వెల్లడించింది. అయితే ఏదో ఓ రోజు వైజాగ్‌లోనే సెటిలవుతానని చెప్పుకొచ్చింది. టీవీ యాంకర్‌గా ఉండటం ద్వారా సినీ ఛాన్సులపై ప్రభావం చూపుతుందేమోననే ప్రశ్నకు సమాధానంగా రష్మీ ఏం చెప్పిందంటే.. హాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారని తెలిపింది. తాను ఈ స్థాయిలో ఉండేందుకు టీవీనే కారణమని వెల్లడించింది. పెళ్లికి వైజాగ్‌కు లింకులేదని తెలిపింది.