గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 27 ఫిబ్రవరి 2020 (18:41 IST)

ఆ హీరోయిన్‌ను సినిమాల్లో తీసుకోవాలంటేనే ఆలోచిస్తున్న నిర్మాతలు, ఏమైంది?

మెహరీన్ పిర్జాదా. ఈ బ్యూటీ గురించి తలుచుకుంటేనే నిర్మాతలు, దర్శకులు ఆలోచిస్తున్నారట. ఒకప్పుడు మెహరీన్‌ను సినిమాల్లో తీసుకోవాలంటే వెంటనే ఒకే చెప్పేసేవారు దర్సకనిర్మాతలు. అయితే ఇప్పుడు మాత్రం ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో మెహరీన్‌కు కూడా అర్థమైపోయిందట.
 
అశ్వద్థామ సినిమాలో నాగశౌర్యతో కలిసి నటించింది మెహరీన్. ఆ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. అయితే తన గత సినిమాల కన్నా ఒకే ఒక్క అశ్వద్దామ సినిమాతో మెహరీన్ దర్సక, నిర్మాతల దగ్గర బాగా చెడ్డపేరు తెచ్చేసుకుందట. అందుకు కారణం సినిమా ప్రమోషన్‌కు ఆమె రాకపోవడం.. ప్రమోషన్‌కు వచ్చి రూం రెంట్ కట్టకుండా వెళ్ళిపోవడం.. చివరకు నిర్మాత ఆ డబ్బులను కట్టి ఆయన కాస్త మీడియాకు లీక్ చేయడం.. ఇది మెహరీన్‌కు పెద్ద చిక్కునే తెచ్చిపెట్టింది.
 
గత కొన్నిరోజుల నుంచి ఈ వివాదం నడుస్తుంటే తాజాగా మెహరీన్ ఇదే విషయంపై మాట్లాడింది. మా తాతకు ఉన్నట్లుండి సీరియస్ అని చెప్పారు. సినిమా ప్రమోషన్‌కు వచ్చాను గానీ.. హడావిడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. తాను హోటల్ నుంచి వెళ్ళేటప్పుడు నా మేనేజర్ పక్కనే ఉన్నాడు. ఆయన మొత్తం డబ్బులను చెల్లించాడు. కానీ అశ్వద్ధామ సినిమా నిర్మాత తాను డబ్బు చెల్లించానని చెబుతూ నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అంటూ బాధపడుతూ చెబుతోందట మెహరీన్. మరి ఏది నిజమో?