అలా చేస్తే ఫలితం ఉంటుందని ఫిదా హీరోయిన్‌కు నచ్చజెప్పిన దర్సకుడు..?
ఫిదా హీరోయిన్ సాయిపల్లవి మరోసారి దర్సకుడు శేఖర్ కమ్ముల దర్సకత్వంలో ఒక సినిమాలో నటించబోతోంది. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్సకత్వంలో వచ్చిన ఫిదా సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సినిమాలు చేసేటప్పుడు శేఖర్ కమ్ముల ఆచితూచి చేస్తుంటారు. గ్యాప్ ఎంత తీసుకున్నా మంచి సినిమా చేయడం శేఖర్ కమ్ములకు అలవాటు.
అయితే ఈమధ్య తాను అనుకున్న హీరోహీరోయిన్లు దొరకలేదట. దీంతో ఉన్న వారితోనే సినిమా చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారట శేఖర్ కమ్ముల. సాయిపల్లవి ప్రధాన పాత్రలో ఒక సినిమాను త్వరలో తెరకెక్కించబోతున్నారు. అది కూడా విభిన్నమైన ప్రేమ కథా చిత్రమట. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా ఉండబోతున్నారట. వీరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా కథ గురించి ఇప్పటికే సాయిపల్లవికి చదివి వినిపించారట శేఖర్ కమ్ముల.
మన కాంబినేషన్లో రెండవ సినిమా కూడా అదిరిపోతుంది. నీకు మంచి మైలేజ్ వచ్చే సినిమా ఇది. ఈ సినిమా మంచి విజయాన్ని కూడా సాధిస్తుందన్న నమ్మకం నాకుంది. అయితే నువ్వు ఈ సినిమాలో కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది అని చెప్పారట శేఖర్ కమ్ముల. హిట్ ఇస్తే ఎంత కష్టమైనా పడడానికి తాను సిద్థమని సాయిపల్లవి కూడా చెప్పింది. మరో నెలరోజుల్లో వీరి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.