క్రేజీ ఆఫర్‌ను వదులుకున్న స్టార్ హీరోయిన్...మోసం చేయలేను (video)

SaiPallavi
ప్రీతి చిచ్చిలి| Last Updated: మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (15:03 IST)
ప్రస్తుతం గ్లామరస్‌గా కనిపించే హీరోయిన్ల హవా నడుస్తున్న తరుణంలో గ్లామర్ విషయంలో హద్దులు పాటిస్తున్నప్పటికీ యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. తన అద్భుతమైన నటనతో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ హీరోయిన్ తెలుగులో నటించిన తొలి చిత్రం ఫిదాతోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతటి క్రేజ్ సంపాదించుకున్నా కూడా సాయి పల్లవి వెండితెరపై తన గ్లామర్ విషయంలో హద్దులను పాటిస్తూ వస్తోంది. 
 
సాయి పల్లవి క్రేజ్‌ను గుర్తించిన ఓ కార్పొరేట్ సంస్థ తాము లాంఛ్ చేయబోయే కొత్త పేస్ క్రీమ్ ప్రోడక్ట్‌కు సాయి పల్లవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుని ఆ క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని భావించారట. ఇందుకోసం ఆ సంస్థ ప్రతినిధులు 2 కోట్ల క్రేజీ ఆఫర్‌తో సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే సాయి పల్లవి వారికి నో చెప్పిందట. 
 
పైగా తనకు ఎంత పారితోషికం ఇచ్చినా ఇలాంటి క్రీమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండలేనని చెప్పిందట. అసలు సినిమాల్లోనే తాను మేకప్ లేకుండా మొటిమలతో నటిస్తానని, అలాంటప్పుడు లేని అందం ఉన్నట్లుగా చూపించి జనాలని మోసం చేయలేనని తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం ఎస్.జె సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
 దీనిపై మరింత చదవండి :