సంబంధిత వార్తలు
- 'మిమ్మల్ని షో దగ్గర కలుస్తా': గాయని... కారులో ఎక్కించుకుని పంట పొలాల్లో...
- గజల్ శ్రీనివాస్‌కు షాక్ మీద షాక్.. మరో వీడియో లీక్..
- క్లాస్ రూమ్‌లో ఇన్నర్వేర్తో పాఠాలు చెప్పిన షైమాకు రెండేళ్ల జైలు
- ట్రంప్ కూతురు ఇవాంకా ఆ రోడ్డుపై వస్తే బావుండన్న సింగర్ సునీత
- ఉర్రూతలూగించిన 'బావలు సయ్యా...' గాయని ఇకలేరు...
''సుచీలీక్స్'' వచ్చేస్తున్నా.. ఎలా వెళ్లానో అలాగే తిరిగొచ్చా: సుచిత్ర
''సుచీలీక్స్'' అంటేనే సినిమా వారికి భయం. వామ్మో అంటూ జడుసుకుంటూ పారిపోతారు. ఎందుకంటే హీరోహీరోయిన్ల అఫైర్లు వాటి తాలూకు ఫోటోలు సుచీలీక్స్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా వైరల్ అయిన ఫోటోల్లో రాన
''సుచీలీక్స్'' అంటేనే సినిమా వారికి భయం. వామ్మో అంటూ జడుసుకుంటూ పారిపోతారు. ఎందుకంటే హీరోహీరోయిన్ల అఫైర్లు వాటి తాలూకు ఫోటోలు సుచీలీక్స్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా వైరల్ అయిన ఫోటోల్లో రానా, త్రిష, ధనుష్, ఆండ్రియా, అనిరుధ్‌లు కూడా వున్నారు. తాజాగా సుచీలీక్స్ పేరిట మళ్లీ రానున్నానని గాయని సుచిత్ర వెల్లడించింది.
తాను ఎలా వెళ్లానో అదేవిధంగా తిరిగి వచ్చేసానని తెలిపింది. ఈ క్రమంలో పలువురు నటీనటుల బాగోతాలను విడుదల చేయనున్నానని చెప్తూ.. ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఇప్పుడా వీడియో కోలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. గతంలో తన ట్విట్టర్ ఖాతాలో నటీనటుల ప్రైవేటు ఫొటోలను సుచిత్ర విడుదల చేయగా, తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
అయితే, అప్పట్లో తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని, ఆ ట్వీట్లతో తనకు సంబంధం లేదని సుచిత్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ప్రస్తుతం సుచిత్ర తిరిగి వచ్చేశానంటూ.. నటీనటుల బాగోతాలను విడుదల చేస్తాననంటూ వీడియో ద్వారా తెలపడం కోలీవుడ్‌లో సంచలనం రేకెత్తిస్తోంది.
