శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 3 జనవరి 2018 (15:57 IST)

గజల్‌ శ్రీనివాస్‌కు షాక్ మీద షాక్.. మరో వీడియో లీక్..

రచయిత, గాయకుడు గజల్ శ్రీనివాస్‌‌కు మరో షాక్ తగిలింది. ఆల‌య‌వాణి రేడియోలో ప‌ని చేస్తోన్న ఓ యువ‌తిని లైంగిక వేధింపుల‌కు గురి చేసిన కేసులో గజల్ శ్రీనివాస్‌కు సంబంధించి మరో వీడియోను లీకైంది. ఇలాంటి వీడియో

రచయిత, గాయకుడు గజల్ శ్రీనివాస్‌‌కు మరో షాక్ తగిలింది. ఆల‌య‌వాణి రేడియోలో ప‌ని చేస్తోన్న ఓ యువ‌తిని లైంగిక వేధింపుల‌కు గురి చేసిన కేసులో గజల్ శ్రీనివాస్‌కు సంబంధించి మరో వీడియో లీకైంది. ఇలాంటి వీడియోలు, బలమైన ఆధారాలుండటంతో గజల్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెపుతున్నారు. గజల్‌ శ్రీనివాస్‌ను బెయిల్‌పై పంపిస్తే ఆధారాలను తారుమారు చేస్తాడని పోలీసులు చెప్తున్నారు.
 
సేవ్ టెంపుల్‌కు గ‌జ‌ల్ శ్రీనివాస్ ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆయనపై లైంగిక వేధింపుల కేసు వుండటంతో ఆయనను ప్రచారకర్తగా సస్పెండ్ చేశారు. సేవ్ టెంపుల్ అధ్య‌క్షుడు వెల‌గ‌పూడి ప్ర‌కాశ్‌రావు ఈ విష‌యంపై మాట్లాడుతూ... త‌మ‌ సంస్థ‌ల్లో ప‌నిచేసే స్త్రీల‌ను దేవ‌త‌ల్లా గౌర‌విస్తామ‌ని.. అలాంటి సంస్థ పేరును అడ్డం పెట్టుకుని ఇలాంటి వికృత కార్యకలాపాలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదన్నారు.
 
ఇదిలావుంటే.. గజల్ శ్రీనివాస్ పచ్చి మోసగాడంటూ బాధితురాలు ఆరోపించింది. గత రెండు నెలల పాటు వేధింపులు అధికమయ్యాయని బాధితురాలు తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లో అతని కాళ్లు పట్టాల్సి వచ్చిందని తెలిపింది. వాటిని తట్టుకోలేకే సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించింది. చాలామంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని, పక్కా సాక్ష్యాలతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని.. అతడు జీవితాంతం జైలులోనే వుండాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.