సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డివి
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (22:10 IST)

కైపు ఎక్కిస్తున్న సోనాల్‌!

Sonal chauhan,
బాలీవుడ్ క‌థానాయిక సోనాల్ చౌహాన్ త‌న హావ‌భావాల‌తో యువ‌త‌ను కైపు ఎక్కిస్తోంది. ఇన్‌ట్రాగ్రామ్‌లో ఓ పాట‌కు కైపుగా ఫీలింగ్స్‌ను వ్య‌క్తం చేస్తూ ఇచ్చిన క్లిప్పింగ్ సోష‌ల్‌మీడియాలో కుర్ర‌కారుని హుషారెత్తించింది. అంగ్ ల‌గాదేరే.. అంటూ గాయ‌ని పాడిన పాట‌కు త‌న‌దైన మూమెంట్స్ ఇస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.

సోనాల్ ఫ్యాషన్ మోడల్, గాయకురాలు, నటి కూడా. తెలుగులో బాల‌కృష్ణ‌తోనే మూడు సినిమాల్లో న‌టించింది. అందులో లెజెండ్ హిట్ అయింది. డిక్టేట‌ర్‌, రూల‌ర్ ఏవ‌రేజ్‌గా ఆడాయి. తాజాగా ఈ ఏడాది హిందీలో ది ప‌వ‌ర్ అనే సినిమాలో న‌టిస్తోంది. త‌ను గాయ‌నిగా కూడా పాడిన పాట‌ల‌కు ఆద‌ర‌ణ‌కూడా పొందాయి. ఇప్పుడు కాస్త ఖాలీ టైంలో ఇలా పాట‌ల‌కు మూవ్‌మెంట్స్ ఇస్తూ అభిమానుల‌ను అల‌రిస్తోంది.