1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 జూన్ 2016 (17:26 IST)

సల్మాన్ సోదరుడితో రొమాన్స్ చేయనున్న సన్నీ లియోన్

పోర్న్ స్టార్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి సన్నీలియోన్. తన నటనతో వెండితెర అరంగేట్రం చేసి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే బాలీవుడ్ అగ్రనటులైన అమీర్ ఖాన్, షారుక్ ఖాన్‌ల సరసన నటించే అవకాశం దక్కించుకున్న ఈ భామ ఇప్పుడు సల్మాన్ సోదరుడితో కలిసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ''తేరా ఇంతేజార్''. 
 
కాగా ఈ చిత్రంలో కథానాయికగా సన్నీలియోన్ నటిస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్ సన్నీ అయితేనే కరెక్టుగా ఉంటుందని భావించిన దర్శకనిర్మాతలు ఈమెనే ఎంపిక చేసుకున్నారు. కాగా సన్నీమీడియాతో మాట్లాడుతూ... అర్బాజ్‌తో నటించడం ఆనందంగా ఉందని, అతనితో నటించడం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పింది. బాలీవుడ్ తనకు అన్నీ ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.