సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 24 అక్టోబరు 2019 (18:45 IST)

త‌మిళ టాప్ డైరెక్ట‌ర్ అట్లీ తెలుగు సినిమా ఎవ‌రితో..?

త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ తాజాగా తెర‌కెక్కించిన చిత్రం విజిల్. విజ‌య్‌తో తెర‌కెక్కించిన ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి క్రేజ్ వ‌చ్చింది. ఈ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ వ‌చ్చిన అట్లీ మీడియాతో మాట్లాడుతూ... తెలుగు సినిమా చేయ‌డం అనేది త‌న క‌ల అని.. ఫ్యూచ‌ర్‌లో జ‌రుగుతుంద‌ని చెప్పాడు. 
 
అయితే... ఎవ‌రితో చేస్తాడు అనేది చెప్ప‌లేదు కానీ.. తెలుగులో ఎన్టీఆర్ అంటే అభిమానం అని చెప్పాడు. త‌న సినిమాలు చూసి బాగున్నాయి అంటూ అభినందిస్తుంటారు. ఆయ‌న చూపించే ప్రేమ‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను అంటూ ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. గ‌త సంవ‌త్స‌ర‌మే ఎన్టీఆర్‌కు అట్లీ క‌థ చెప్పాడు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న సెట్స్ పైకి వెళ్ల‌లేదు. 
 
ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. వ‌చ్చే సంవ‌త్స‌రంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే... అట్లీ షారుఖ్ ఖాన్‌తో సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకున్నాడు.
 
విజిల్ రిలీజ్ హడావిడి అయిన త‌ర్వాత షారుఖ్ ఖాన్‌తో సినిమా స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన త‌ర్వాత కానీ అట్లీ వేరే ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడు. అందుచేత ఎన్టీఆర్ - అట్లీ మూవీ 2021లో ఉండ‌చ్చు అని స‌మాచారం.