మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 27 జులై 2017 (15:00 IST)

పరిచయాలు పెంచుకుందాం... అమెరికాకు అల్లు అర్జున్...

ఇప్పుడు సినిమా స్టార్లకు ఓవర్సీస్ మార్కెట్ బంగారు బాతుగుడ్డు లాంటిది. ఇక్కడ రూపాయలు రాలితే అక్కడ డాలర్లు రాలుతాయన్నది తెలిసిందే. అందుకే చాలామంది హీరోలు తమ చిత్రాల ప్రమోషన్ల కోసం ఇప్పుడు అమెరికా, లండన్ బాట పడుతున్నారు. మొన్నీమధ్యనే దువ్వాడ జగన్నాథం చి

ఇప్పుడు సినిమా స్టార్లకు ఓవర్సీస్ మార్కెట్ బంగారు బాతుగుడ్డు లాంటిది. ఇక్కడ రూపాయలు రాలితే అక్కడ డాలర్లు రాలుతాయన్నది తెలిసిందే. అందుకే చాలామంది హీరోలు తమ చిత్రాల ప్రమోషన్ల కోసం ఇప్పుడు అమెరికా, లండన్ బాట పడుతున్నారు. మొన్నీమధ్యనే దువ్వాడ జగన్నాథం చిత్రం కోసం అమెరికా వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ మరోసారి అమెరికా వెళ్లబోతున్నాడట.
 
ఐతే ఈ పర్యటన చిత్రం ప్రమోషన్ కోసం కాదటండోయ్. నా పేరు సూర్య అనే చిత్రం కోసం అమెరికాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకునేందుకు వెళుతున్నాడట. ఓ పవర్ ఫుల్ సైనికుడు పాత్రలో ఈ చిత్రంలో కనిపించనున్న అల్లు అర్జున్ అందుకు తగిన బాడీ లాంగ్వేజ్ కోసం అక్కడికి వెళుతున్నాడట. 
 
ఎలాగూ నెల రోజులు వుంటాడు కనుక... అక్కడ వున్నన్ని రోజులు అమెరికాలో వున్న తెలుగు అభిమానులతో మాటామంతీ వుంటాయని చెప్పుకుంటున్నారు. అలా మార్కెట్ పెంచుకునేందుకు బన్నీ చక్కటి స్కెచ్ వేశారని అనుకుంటున్నారు.