1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT

ఫిబ్రవరి 5న "కేడీ" ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్

కింగ్ నాగార్జున హీరోగా కిరణ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి కామాక్షి కళామూవీస్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం "కేడీ" షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీ-రికార్డింగ్ జరుగుతోంది. ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ఫిబ్రవరి 5న హైదరాబాదులో జరుగనుంది.

ఈ సందర్భంగా నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... నాగార్జునగారితో మా బ్యానర్లో తీసిన స్టైలిష్ కమర్షియల్ ఫిలిమ్ కేడి. సందీప్ చౌతా సంగీతం వహించిన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఫిబ్రవరి 5న ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తున్నాం. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12న కేడీని విడుదల చేయడానికి ప్లాన్ చేశాం. మా బ్యానర్లో మరో సూపర్ హిట్ చిత్రంగా కేడీ నిలుస్తుందని అన్నారు.

కింగ్ నాగార్జున, మమతా మోహన్ దాస్, అమెరికా అమ్మాయి లిండా ఓ ఇంపార్టెండ్ రోల్ చేస్తున్న కేడీ చిత్రంలో స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం అంకుర్, లగాన్ ఫేం అఖిలేంద్ర మిశ్రా, డాన్ విలన్ కెల్లీదోర్జీ, షాయాజీ షిండే, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.

అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళామూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్ చౌతా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అక్కినేని వెంకటరత్నం, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కిరణ్