మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (13:32 IST)

రెండు హిట్లిచ్చి.. రెండు కార్లు ఉచితంగా కొట్టేసిన దర్శకుడు!

ఇటీవలి కాలంలో తెలుగు చిత్రపరిశ్రమలో అనేక మంది ప్రతిభావంతులైన యువ దర్శకులు ఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి వారితో మూవీలు చేసేందుకు అగ్రహీరోలు సైతం అమితాసక్తిని చూపుతున్నారు. దానికి కారణం.. యువ ప్రతిభతో పాటు.. సరికొత్త కథాంశాలతో తెరకెక్కిస్తుండటమే. ఇలాంటి యువ దర్శకుల్లో వెంకీ కుడుముల ఒకరు. 
 
"ఛలో" మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ దర్శకుడు ఆరంభంలోనే మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, సరైన విజయం కోసం పరితపిస్తూ వచ్చిన యువ హీరో నాగశౌర్యకు కూడా మంచి హిట్టునందించాడు. త‌న కెరీర్‌లో మ‌రిచిపోలేని చిత్రాన్ని అందించినందుకు కృతజ్ఞ‌త‌గా హీరో నాగ‌శౌర్య దర్శకుడు వెంకీ కుడుముల బ్రాండెడ్ కారును కానుక‌గా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.
 
ఇపుడు మరో యువ నటుడు కూడా వెంకీకి లక్షలాది రూపాయల విలువ చేసే రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఆ యువ హీరో ఎవరో కాదు.. ఇటీవలే ఓ ఇంటివాడు అయిన హీరో నితిన్. రష్మిక మందన్నాతో కలిసి నితిన్ నటించి భీష్మ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకోవ‌డ‌మేకాకుండా నితిన్ కెరీర్‌లో మ‌రో హిట్ సినిమాగా నిలిచింది. త‌న‌కు మ‌రిచిపోలేని చిత్రాన్ని అందించిన వెంకీకుడుముల‌కు కృత‌జ్ఞ‌త‌గా నితిన్‌.. డైరెక్ట‌ర్ వెంకీకి రేంజ్ రోవ‌ర్ కారునుబ‌హుమతిగా ఇచ్చాడు.
 
త‌న టాలెంట్‌తో స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఇద్ద‌రు యువ‌హీరోల‌కు మంచి సినిమాలు అందించి.. మొత్తానికి వారి నుంచి 2 కార్ల‌ను గిఫ్ట్‌గా కొట్టేశాడు వెంకీ కుడుముల. పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కారు బ‌హుమ‌తిగా ఇచ్చిన నితిన్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ వెంకీ ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇలాంటి అరుదైన అవ‌కాశం ఏ డైరెక్ట‌ర్‌కు రాదంటే అతిశ‌యోక్తి కాదేమో.