సంజయ్ దత్‌కు తండ్రిగా అమీర్ ఖాన్.. రణబీర్ కపూర్ పాత్రేంటి?
ఇదేంటి? సంజయ్ దత్‌కు మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తండ్రిగా నటించబోతున్నాడా? అని అనుకుంటున్నారు కదూ.. అయితే సంజయ్ దత్ బయోపిక్‌లో అమీర్ ఖాన్ నటించనున్నట్లు బాలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. మున్నాభాయ్ ఎం
ఇదేంటి? సంజయ్ దత్‌కు మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తండ్రిగా నటించబోతున్నాడా? అని అనుకుంటున్నారు కదూ.. అయితే సంజయ్ దత్ బయోపిక్‌లో అమీర్ ఖాన్ నటించనున్నట్లు బాలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి.
మున్నాభాయ్ ఎంబీబీఎస్, త్రీ ఇడియట్స్, పీకే వంటి సినిమాలను రూపొందించిన రాజ్ కుమార్.. తాజాగా సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన సంప్రదింపుల కోసం రాజ్ కుమార్ అమీర్ ఖాన్‌ను కలిసినట్లు తెలుస్తోంది.
సంజయ్ దత్ కూడా తన కథను హిరాణీ అయితేనే బాగా తీయగలడని భావించడంతో దర్శకత్వ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. ఈ క్రియేటివ్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్.. ఇప్పటికే సంజయ్ పాత్రలో యంగ్ హీరో రణబీర్‌ను ఎంచుకున్నాడు.
కాగా, ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం సంజయ్ దత్ తండ్రి పాత్రకు అమీర్ ఖాన్‌ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ దంగల్ సినిమాలో ఇద్దరు పిల్లల తండ్రి పాత్రలో నటిస్తున్న అమీర్ ఖాన్.. రణబీర్ కపూర్ వంటి యంగ్ హీరోకు తండ్రిగా నటిస్తాడా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అదే గనక జరిగితే ఇక బిటౌన్లో సెన్సేషన్ కాక తప్పదు.