శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 9 మే 2017 (16:28 IST)

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న బాలకృష్ణ... ఇంతకాలం లైసెన్స్ లేదా?

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. నిజమా? అంటే ఇంతకాలం ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ ఉత్పన్నమవుతుంది. అలా అనుకుంటే మాత్రం పప్ప

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. నిజమా? అంటే ఇంతకాలం ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ ఉత్పన్నమవుతుంది. అలా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. బాలయ్య తీసుకుంది ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్.
 
దర్శకుడు పూరీ జగన్నాథ్, బాలయ్య కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శ్రియ ఓ కథానాయిక. బాలకృష్ణ 101వ చిత్రం. ఈ చిత్రం షూటింగ్ కోసం పోర్చుగల్ వెళుతున్నారు. అక్కడే 40 రోజుల పాటు షూటింగ్ జరుగనుంది. పోర్చుగల్‌లో తీసే సీన్స్‌లో చాలావరకు ఈ డ్రైవింగ్ సీన్స్, ఛేజింగ్ సీన్స్ ఉన్నాయి. ఈ సీన్స్ చేయాలంటే విధిగా ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉండితీరాలి. 
 
అందుకే హైదరాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో ఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన అధికారులు... బాలయ్యకు ఇంటర్నేషనల్ లైసెన్స్‌ను మంజూరు చేశారు. దీన్ని బాలయ్య స్వయంగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి తీసుకున్నారు. కాగా, ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ముగ్గుర హీరోయిన్లు నటిస్తున్న విషయం తెల్సిందే.